![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2''(karthika deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -635 లో...... జ్యోత్స్నకి దీపే అసలైన వారసురాలు అన్న నిజం తెలిసిందని కార్తీక్ కి తెలుస్తుంది. దాంతో హడావిడిగా దాస్ దగ్గరికి వస్తాడు కార్తీక్. జ్యోత్స్న డిఎన్ఏ టెస్ట్ చేసింది.. దీప సాంపిల్స్ టెస్ట్ చేయించింది.. దీపనే అసలైన వారసురాలనే నిజం జ్యోత్స్నకి తెలిసిపోయింది.. ఇందాక పారు చేతిలో ఆ రిపోర్ట్స్ చూసానని కార్తీక్ అంటాడు. పారుకి ఇంగ్లీష్ రాదు కాబట్టి తనకి ఆ రిపోర్ట్స్ లో ఏముందో తెలియదు.. ఏంటని అడిగితే కవర్ చేసానని కార్తీక్ చెప్పగానే దాస్ టెన్షన్ పడతాడు. ఇప్పుడు జ్యోత్స్న ఏం చేయబోతుంది. ఖచ్చితంగా దీపని చంపాలని ట్రై చేస్తుందని కార్తీక్ అంటాడు. ఇప్పుడు దీపని కాపాడాలని కార్తీక్ అంటాడు.
దీప కోసం కార్తీక్ వెతుకుతాడు. దీప డాబా పైన చెట్లకి నీళ్లు పోస్తుంది. అక్కడికి జ్యోత్స్న వెళ్లి వెనకాల నుండి నెట్టెయ్యాలని ట్రై చేస్తుంది. అప్పుడే కార్తీక్ వచ్చి దీప అని గట్టిగా అరుస్తాడు. దీప వెనకాలున్న జ్యోత్స్నని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ప్రెగ్నెంట్ వాళ్ళు ఇలా హైట్ లో ఉంటే కళ్ళు తిరుగుతాయంట కదా పడిపోతే పట్టుకుందామని చూస్తున్నానని జ్యోత్స్న అంటుంది. ఏంటి బావ నేను ఏమైనా దీపని తోసేస్తాననుకున్నవా అని జ్యోత్స్న అంటుంది. దీప నువ్వు వెళ్ళు అని కార్తీక్ తనని కిందకి పంపిస్తడు. ఏంటి బావ ఏం చేస్తానని కంగారుపడుతున్నావా.. పదా అందరం విందు భోజనం చేద్దామని జ్యోత్స్న అంటుంటే అందులో ఏదో విషం కలిపి ఉంటుందని కార్తీక్ కి డౌట్ వస్తుంది. అందరు హాల్లో ఉంటారు. అందరం భోజనం చేద్దాం పదండి అన్ని వంటలు దగ్గరుండి సెలెక్ట్ చేసానని జ్యోత్స్న అంటుంది. తను అలా అంటుంటే కార్తీక్ అనుమానం ఇంకా బలపడుతుంది. అందరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇక్కడ ముఖ్యమైన గెస్ట్ దీప కాబట్టి ముందు భోజనం దీప చెయ్యాలి. మొదటి ముద్ద నేను దీపకి తినిపిస్తానని జ్యోత్స్న అంటుంది. డౌట్ లేదు అందులో విషం కలిపిందని కార్తీక్ అనుకుంటాడు. అది స్పెషల్ కాదు మరదలా దీప చేత్తో నువ్వు తినడం స్పెషల్.. దీప నువ్వు జ్యోత్స్నకి భోజనం తినిపించమని కార్తీక్ అనగానే జ్యోత్స్న టెన్షన్ పడ్డట్టు యాక్టింగ్ చేస్తుంది. కానీ దీప చేత జ్యోత్స్న భోజనం తిని కార్తీక్, దాస్ కి షాక్ ఇస్తుంది.
నా కూతురు అందులో ఏం కలపలేదు అల్లుడు.. మనల్ని ఫూల్స్ చేసింది. తన ప్లాన్ వేరే ఉందని కార్తీక్ తో దాస్ అంటాడు. ముందు అందరు తినండి.. ఆ తర్వాత ఇంకా వినోదకార్యక్రమాలు ఉన్నాయని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న కేక్ కటింగ్ కి రెడీగా ఉంటుంది. సుమిత్ర గురించి గొప్పగా చెప్తుంది. నువ్వు పెళ్లి చేసుకోవడం కావాలని సుమిత్ర అనగానే సరే అమ్మ పెళ్లికొడుకు ఇక్కడే ఉన్నాడని కార్తీక్ వంక చూపిస్తుంది. అందరు షాక్ అవుతారు. అందేంటని దీప అనగానే పూర్తిగా వినండి మా బావలాగా ఉండాలని అంటున్నానని జ్యోత్స్న అంటుంది. ఆ విషయం మీ నాన్నకి చెప్పమని కాంచన అంటుంది. అందరు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |